ఉత్తరప్రదేశ్లోని వారణాసి పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దేశంలో కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో మరో 4 కొత్త వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. బనారస్-ఖజురహో, లక్నో-సహరాన్పూర్, ఫిరోజ్పూర్-ఢిల్లీ సహా ఎర్నాకులం-బెంగళూరు మార్గాల్లో ఈ రైళ్లు నడవనున్నాయి. ఈ కొత్త రైళ్లు భారతీయ రైల్వే నెట్వర్క్ను మరింత బలోపేతం చేయనున్నాయి.