జమ్మూకశ్మీర్లోని కుప్వాడా జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలోని కేరాన్ సెక్టార్లో భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ పింపుల్’ విజయవంతమైంది. ఈ ఉమ్మడి ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఈ ఆపరేషన్ నిన్న ప్రారంభమైంది. ఏజెన్సీల నుంచి అందిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా ఆర్మీకి చెందిన వైట్ చినార్ కార్ప్స్ ఈ ఉమ్మడి ఆపరేషన్ను చేపట్టింది.