SKLM: టెక్కలిలో అక్రమ మద్యం విక్రయం కేసులో బూరగాంకి చెందిన జి. శేఖర్‌కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.2 లక్షల జరిమానా విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ యు. మాధురి శుక్రవారం తీర్పు ఇచ్చారు. ఈ మేరకు సీఐ విజయ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.