నటుడు, BJP ఎంపీ రవి కిషన్‌కు మరోసారి హత్య బెదిరింపులు వచ్చాయి. ఆ బెదిరింపు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్నింగ్ మెసేజ్ రవి కిషన్ ఇంట్లో పూజలు చేసే పూజారికి వచ్చింది. అందులో ‘ఈసారి మోదీ, యోగి ఇద్దరూ గెలవరు. నిన్ను చంపుతా, MP రవికిషన్ను వదలను’ అని ఉందని పూజారి పోలీసులకు చెప్పాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.