NZB: బోధన్ మంజీరా పరీవాహక ప్రాంతాల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు వాహనాలను శుక్రవారం రాత్రి అధికారులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు, పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ఈ వాహనాలను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై మచ్చేంధర్ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.