మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సమావేశ మందిరంలో రేపు సైన్స్ మూఢనమ్మకాలపై అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతుందని నాస్తిక సమాజం జిల్లా అధ్యక్షులు చింతకింది జనార్దన్ తెలిపారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. దేవుడి మహిమలను శాస్త్రీయంగా నిరూపించి రూ. 10 లక్షల రూపాయలు గెలుచుకోవాలని సూచించారు. సాంఘిక ఆర్థిక పోరాటాలు బొమ్మ బొరుసు లాంటివన్నారు.