JN: వల్మిడి-ముత్తారం గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి ఇటీవల వర్షాలకు దెబ్బ తిని కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సమస్యపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బుధవారం రూ.3 కోట్ల వ్యయంతో కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. త్వరలో నిర్మాణం పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.