సత్యసాయి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ పుట్టపర్తిలో సత్యసాయి గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు. సత్యసాయి బాబా నామస్మరణతో పవిత్రమైన గిరుల చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేశారు. కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.