ADB: ఈ నెల 8న రెండవ శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ,ప్రైవేటు,ఎయిడెడ్ పాఠశాలకు పని దినాలుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీచేశారు. ఆగస్టు 28న అత్యదిక వర్షం కురిసిన నేపథ్యంలో సెలవులు ఇవ్వడంతో ఆ సెలవు దినానికి బదులుగా ఈ రెండవ శనివారం విద్యా సంస్థలు సెలవు రద్దు చేశామని పేర్కొన్నారు. విద్యా సంస్థలు గమనించాలని సూచించారు.