అన్నమయ్య: వాల్మీకిపురం మండలం గండబోయనపల్లికి చెందిన ఎం. మంజు గుండె శస్త్రచికిత్స అనంతరం ఆర్థిక సహాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన చెక్కును ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శనివారం నగిరిపల్లిలో అందజేశారు. మంజు మాట్లాడుతూ, ఎమ్మెల్యే పేదల పాలిట ఆపద్భాందవుడని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పులి సత్యనారాయణ రెడ్డి, టీడీపీ నేతలు పాల్గొన్నారు.