W.G: డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఇద్దరు దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ట్రై సైకిల్స్ అవసరం కలిగిన అర్హులైన దివ్యాంగులు ఎవరైనా ఉంటే నియోజవర్గంలో తన కార్యాలయంలో సంప్రదిస్తే వారికి కూడా వీలైనంత త్వరగా అందించేలా ఏర్పాటు చేస్తానని తెలిపారు.