అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానంలో సోమవారం పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో పాటు స్థానిక భక్తులు పాల్గొన్నారు. అర్చక స్వాములు అర్చనలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ విషయాన్ని ఆలయ ఛైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, కార్యనిర్వాహణాధికారి డి.వి. రమణారెడ్డి తెలిపారు.