ప్రకాశం: అర్థవీడులోని స్థానిక బీసీ బాలుర వసతి గృహాన్ని మండల ఇంఛార్జ్ వ్యవసాయ అధికారి జి. శివగంగ ప్రసాద్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వన్ ఆఫీసర్ వన్ ఇనిస్ట్యూట్లో భాగంగా బీసీ బాలుర వసతి గృహన్ని పరిశీలించినట్లు అయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరుపట్టిక, భోజనం యొక్క మెనూ కాపీలను ఆయన పరిశీలించారు.