ప్రకాశం: PMKY 4.0 ఆధ్వర్యంలో మార్కాపురం జిల్లాలోని 3 సెంటర్లలో నిరుద్యోగ యువతకి ఉచిత నైపుణ్య శిక్షణ శిబిరాన్ని ఈ నెల 12న నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి కంచిబాబు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, ఎర్రగొండపాలెం ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ కోర్స్పై శిక్షణ ఇస్తున్నామన్నారు.