SRCL: తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లి ఉన్నత పాఠశాలలో సంఘసంస్కర్త, సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు భూక్య రాజు నాయక్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. విద్య అభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లచ్చయ్య, శంకర్, మీనాక్షి పాల్గొన్నారు.