KRNL: పెద్దకడబూరు గ్రామంలోని లక్ష్మీపేటలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డు నిర్మాణ పనులను టీడీపీ నాయకులు మంగళవారం మొదలుపెట్టారు. టీడీపీ బీసీ సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, టీడీపీ బూత్ యూనిట్ ఇన్ఛార్జ్ తలారి అంజీ పనులను పర్యవేక్షించారు. సీఎం చంద్రబాబుతోనే గ్రామాలకు మహర్ధశ వచ్చిందన్నారు.