NDL: ప్రతి బాలిక శక్తి యాప్‌పై అవగాహన కలిగి ఉండాలని శక్తి టీం సభ్యులు తెలిపారు. ఇవాళ ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు ఐటీసీ సమీపంలోని బాలికల పాఠశాలలో హెడ్ కానిస్టేబుళ్లు డి.ఎన్. ప్రసాద్, తదితరులు అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు, సైబర్ నేరాల నుంచి రక్షణ మార్గాలను వివరించి, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.