GNTR: దేశంలో పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని, యుద్ధాన్ని నివారించడానికి ప్రధాని మోదీ ట్రంప్‌తో చర్చలు జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ కోరారు. కొత్తపేట సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. యుద్ధం జరిగితే భారత్ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.