AP: వైసీపీ కార్యకర్తలకు అధిష్టానం నుంచి వార్నింగ్ వచ్చినట్లు సమాచారం. సోషల్ మీడియాలో నకిలీ లింకులు క్లిక్ చేయకూడదని వైసీపీ కోరిందని తెలుస్తోంది. కార్యకర్తల వ్యక్తిగత వివరాలు సేకరించడానికి ఈ లింకులు పంపిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తోంది. వైసీపీ వాళ్లు అప్రమత్తంగా ఉండాలని జగన్ టీమ్ హెచ్చరిక జారీ చేసినట్లు ఓ పోస్ట్ వైరల్ అవుతుంది.