TG: హైదరాబాద్ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత నిరసన దీక్ష చేపట్టారు. నిన్న ఖమ్మంలో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా దీక్ష చేపట్టిన ఆమెను పోలీసులు అరెస్టు చేసి.. హైదరాబాద్ తరలించారు. దీంతో ఆమె కార్యాలయంలో దీక్ష కొనసాగిస్తున్నారు. వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు కూల్చిన చోటే వారికి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.