AP: పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో అవుట్ డోర్ క్రీడా స్టేడియాన్ని శాప్ ఛైర్మన్ రవినాయుడు ప్రారంభించారు. తణుకు హౌసింగ్ బోర్డ్ కాలనీ, బాలుర పాఠశాల ఆవరణలో ఉన్న ఇండోర్ స్టేడియాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తణుకు ఇండోర్ స్టేడియం నిర్మాణాల పూర్తికి నిధులు మంజూరు చేశారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానం కల్పిస్తున్నామని తెలిపారు.