VSP: రాష్ట్రంలో సంచలనం కలిగించిన ‘సృష్టి’ అక్రమాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన ముగ్గురు ప్రభుత్వ వైద్యులపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించింది. అక్రమాలకు పాల్పడిన వారిలో శ్రీకాకుళం మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ విద్యుల్లత కూడా ఉన్నారు. ఈమేరకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.