SKLM: నరసన్నపేట మండలం మాకివలస గ్రామానికి చెందిన రావాడ ఉదయ్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మృతుడు ఉదయ్ టీడీపీ సభ్యత్వం ఉండడంతో మంగళవారం మబగాంలోని ఎమ్మెల్యే స్వగృహంలో రూ.5లక్షల చెక్కును తండ్రి రమణయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.