టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లి తేదీ ఖరారైంది. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను అతడు వివాహం చేసుకోనున్నాడు. గతేడాది జూన్ 4న లక్నోలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, మార్చి 14న మసూరిలో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం. ఆ తర్వాత మార్చి 17న లక్నోలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించనున్నారు. కాగా, వంశిక LICలో పనిచేస్తుందని తెలుస్తోంది.