ప్రకాశం: ఒంగోలు అర్టీసీ బస్టాండ్లో ఒక మహిళా ప్రయాణికురాలి వద్ద ఉన్న సుమారు 5 సవర్ల బంగారు ఆభరణాలను దొంగలు అపహరించారు. అమ్మనబ్రోలుకు చెందిన కావూరి మేరి ఒంగోలు బస్టాండ్లో చీరాల వెళ్లే బస్సు ఎక్కిన తర్వాత తన సంచిలోని పర్సులో జిప్ తీసి ఉందని, అందులోని బంగారు ఆభరణాలు మాయమయ్యాయని గుర్తించింది. ఈ ఘటనపై ఆమె ఒంగోలు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.