ELR: ఒరిస్సా రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని బాబా వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి ఏలూరు తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను జిల్లా టూ టౌన్ సీఐ అశోక్ కుమార్ అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏలూరుకు చెందిన పాలిమేర శ్రీరాం, తేతకలి బాలాజీ, వంజరపు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.