MDK: యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడలపై దృష్టి సారించాలని రామాయంపేట ఎస్సై బాలరాజు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని ప్రగతి ధర్మారం గ్రామంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి SI ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాటాడుతూ.. క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీర దారుఢ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.