అన్నమయ్య: రాజంపేటలోని గర్ల్స్ హాస్టల్‌పై మార్చి 8న దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అరుణ్ లగిడి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజంపేట (M) కొత్త బోయినపల్లిలోని హాస్టల్ సిబ్బందిపై దాడి, విద్యార్థినులను అసభ్య పదజాలంతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.