GNTR: అమరావతి ప్రాంతంలోని మందడంలో 200 గదులతో ఫైవ్ స్టార్ డబుల్ ట్రీ (హిల్టన్) హోటల్, 10,000 మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి భూమిపూజ జరిగింది. రూ. 330 కోట్లతో 4 ఎకరాల్లో హోటల్, 2.5 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ కె. కన్నబాబు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.