TG: HYD మైలార్‌దేవ్‌పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఇద్దరి చొప్పున వ్యక్తులు రెండు బైక్‌లపై వెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన ఆ కారు వారి బైక్‌లను బలంగా ఢీ కొట్టింది. నలుగురు యువకులకు గాయాలయ్యాయి. అయితే కారు డ్రైవర్ కిషోర్ భయంతో కారును మరింత వేగంగా పోనివ్వడంతో దాని కింద భాగంలో బైక్ చిక్కుకుపోయింది. 200 మీటర్ల వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది.