నంద్యాల: జిల్లా మహానంది గ్రామానికి చెందిన స్వప్న (21) అనే యువతి మంగళవారం నల్లమల అటవీ ప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహానందిలోని ఈశ్వర్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న స్వప్న మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.