TPT: నాయుడుపేట పట్టణంలో మంగళవారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 129వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ పక్కన ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు జువ్వలపాటి మస్తాన్, వినుకొండ ధనంజయ, సులేమాన్ తదితరులు పాల్గోన్నారు.