ATP: గుత్తి మున్సిపాలిటీలో మంగళవారం దినసరి సుంకం వసూలుకు బహిరంగ వేలంపాట నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. దినసరి, వారపు, జంతువదశాల నుంచి సుంకం వసూలుకు బహిరంగ వేలంపాట నిర్వహించామన్నారు. ఈ వేలంపాటలో బోయ వేణు రూ. 22,51,000కు బహిరంగ వేలం పాట పాడి సుంకం వసూలు చేసుకునే హక్కును దక్కించుకున్నారని తెలిపారు.