NZB: నవీపేట్ మండలం బినోల గ్రామంలో మంగళవారం ‘ప్రజాపాలన – ప్రగతి పాలన’ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. సర్పంచ్ పుట్ట రేవతి పోశెట్టి, ఉప సర్పంచ్ నవీన్ ఆధ్వర్యంలో మురికి కాలువలను శుభ్రం చేయించి, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. దోమల నివారణకు ఫాగింగ్, మందుల స్ప్రే చేయించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు కోరారు.