కడప: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో ఇవాళ జరుగుతున్న పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మాల్ ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు 144 సెక్షన్ అమలు, జిరాక్స్ సెంటర్ల మూసివేత, ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం విధించారు. ప్రశ్నపత్రాలకు ఎస్కార్ట్ భద్రత వంటి చర్యలతో పోలీసు యంత్రాంగం ఎర్పాట్లు చేసినట్లు తెలిపారు.