తెలుగు రాష్ట్రాల్లోని కోర్టుల్లో వాదనలన్నీ ఆంగ్లంలోనే జరుగుతాయి. తీర్పులు కూడా ఇంగ్లీష్లోనే వస్తాయి. దీంతో సామాన్యులకు అర్థం కాని పరిస్థితి. కానీ ఇకపై తీర్పులన్నీ స్థానిక భాషలో అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు తెలంగాణ హైకోర్టులో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం కొత్త పోస్టులను సైతం మంజూరు చేసింది.