NLG: మిర్యాలగూడలోని హనుమాన్ దేవాలయాన్ని శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్ స్వామి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దర్శించుకున్నారు. ఈ నెల 26న జరిగే శ్రీ మహాలక్ష్మి యాగం నిర్వహణ కోసం వారు భక్తులతో కలిసి పట్టణంలో బిక్షాటన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాగ విశిష్టతను చాటిచెప్పారు.