ప్రకాశం: కొనకనమిట్ల మండలం వెలుగొండలో శ్రీ వెలుగొండ వెంకటేశ్వర స్వామి తిరుణాల సందర్భంగా రేపు ఎడ్ల పందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించనున్నారని, అనంతరం విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందించనున్నట్లు పేర్కొన్నారు.