W.G: పుట్టినరోజు పేరుతో తణుకు హైవేపై హల్చల్ చేస్తున్న ఆకతాయిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాణసంచా కాల్చి, నడిరోడ్డుపై కేకులు కట్ చేస్తూ అర్ధరాత్రి సమయంలో వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారనే ఫిర్యాదుతో ఆరుగురు యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అర్థరాత్రి సమయంలో పుట్టినరోజు వేడుకలు పేరుతో నడిరోడ్డుపై హల్చల్ చేసే ఆకతాయిలపై చర్యలు తీసుకుంటామన్నారు.