SRD: హాస్టల్ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టివారికి నాణ్యమైన భోజనం, విద్య అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి రామాచారి అన్నారు. మునిపల్లిలోని SC హాస్టల్‌ను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. టెన్త్ విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని సూచించారు. అనంతరం కిచెన్, స్టోర్ గదులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వార్డెన్ రామప్పకు సూచించారు.