బిస్కెట్లు తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. బిస్కెట్లలో దాగి ఉండే చక్కెర, ఉప్పు మోతాదుకు మించి ఉంటాయి. నిల్వ ఉండటం కోసం వాడే ప్రిజర్వేటివ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి చేటు చేస్తాయి. వీటిలో విటమిన్లు లేదా ఖనిజాలు ఉండవు, కేవలం ‘కేలరీలు’ మాత్రమే ఉంటాయి. బిస్కెట్లలోని కృత్రిమ రుచుల వల్ల పిల్లలు ఇంట్లో వండిన పప్పు, కూరలు, పండ్లు వంటి సహజమైన ఆహారాన్ని ఇష్టపడరు.