TG: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు పదవీకాలం ఈ నెల 31తో ముగియనుండగా, మరో 3 నెలలు పొడిగించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖకి ప్రభుత్వం లేఖ రాసింది. కాగా, గతంలోనూ ఆయన పదవీకాలాన్ని కేంద్రం 7 నెలలు పొడిగించిన విషయం తెలిసిందే.