AKP: గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేని అభివృద్ధిని 20 నెలల్లో చేసి చూపించామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. సోమవారం సబ్బవరం జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పరవాడ మండలం తాడిగ్రామాన్ని తరలించేందుకు సీఎం ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. సబ్బవరం మండలం బాటజంగాలపాలెంలో పది ఎకరాల్లో రూ.28 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామన్నారు.