WG: ఇరగవరం మండలం కావలిపురం శివారు యర్రాయి చెరువుపాలెంలో గత మూడు నెలలుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి సమీపిస్తుండటంతో సమస్య తీవ్రత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీపీఎం మండల కన్వీనర్ కామన మునిస్వామి ఆధ్వర్యంలో సోమవారం సర్పంచ్ వి.అప్పలస్వామికి వినతిపత్రం అందజేశారు.