KRNL: వైసీపీ వారు ఎంత హేళన చేసినా ఫర్వాలేదని, ప్రజలకు కూటమి ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. చంద్రబాబు కన్నెర చేస్తే వైసీపీ వారు తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని అన్నారు.