BDK: వనవాసి సంస్థ కేవలం ఆదివాసిల అభ్యున్నతి కొరకు ఏర్పాటు చేశారని వనవాసీ కళ్యాణ పరిషత్ సూర్యనారాయణ అన్నారు. చర్ల మండలం బెస్త కొత్తూరు గ్రామానికి చెందిన రైతు నల్లూరి రామకృష్ణ సతీమణి తులసి కుమారి జ్ఞాపకార్థం వారి కుమారుడు, కోడలు నల్లూరి రూప్ చంద్ – శిరీష, వనవాసీ కళ్యాణ పరిషత్ కొమురం భీం విద్యార్థి నిలయంలో ఇవాళ భోజనం ఏర్పాటు చేశారు.