AP: కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మాటల్లో చెబితే.. వైఎస్ఆర్ చేతల్లో చూపించిన నాయకుడని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నాడు-నేడు ద్వారా బడుల రూపు రేఖలను జగన్ మార్చారని పేర్కొన్నారు. రూ.16 వేల కోట్లు విద్య కోసం ఖర్చు చేశారని గుర్తుచేశారు. ఒక సంఘ సంస్కర్తగా జగన్ అడుగులు వేసినట్లు చెప్పారు.