W.G: యలమంచిలి మండలం అడవిపాలెంలో పాలకొల్లు నుంచి దొడ్డిపట్ల సిమెంట్, తారు రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఇవాళ శంకుస్థాపన చేశారు. ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో రూ. 5 కోట్లతో ఈ పనులను చేపట్టినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.