మధ్యప్రదేశ్లో చిన్నారులకు న్యూస్పేపర్పై మధ్యాహ్న భోజనం వడ్డించిన వీడియోను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘X’లో షేర్ చేశారు. 20 ఏళ్లకు పైగా BJP ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రంలో విద్యార్థులకు కనీసం ప్లేట్లు అందించలేని పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తును ఇంత దయనీయ స్థితిలో పెంచుతున్న CM, ప్రధానికి సిగ్గు చేటు అని మండిపడ్డారు.