అప్పుడప్పుడు ప్రతి ఒక్కరికి కన్ను కొట్టుకోవడం జరుగుతుంది. కుడి కన్ను కొట్టుకుంటే మంచి, ఎడమ కన్ను కొట్టుకుంటే చెడు జరుగుతుందని పెద్దలు చెబుతుంటారు. అయితే దీని వెనుక ఒక సైంటిఫిక్ కారణం ఉంది. ఒత్తిడి, అలసట, నిద్రలేమి, అధికంగా కెఫీన్ తీసుకోవడం వల్ల కన్ను కొట్టుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. కంటి రెప్పలోని చిన్న కండరాలు వణకడం వల్ల అలా జరుగుతుందని అంటున్నారు.